గంధము పుయ్యరుగా…

జూన్ 16, 2008

రాగం: పున్నాగవరాళి
తాళం: ఆది

పల్లవి:

గంధము పుయ్యరుగా పన్నీరు
గంధము పుయ్యరుగా

అను పల్లవి:

అందమయిన యదునందనుపై
కుందరదన లిరవొందగ పరిమళ ||గంధము||

తిలకము దిద్దరుగా కస్తూరి తిలకము దిద్దరుగా
కలకలమను ముఖకళగని సొక్కుచు
బలుకుల నమృతము లొలికెడు స్వామికి ||గంధము||

చేలము గట్టరుగా బంగారు చేలము గట్టరుగా
మాలిమితో గోపాలబాలులతో
నాల మేపిన విశాలనయనునికి ||గంధము||

హారతులెత్తరుగా ముత్యాల హారతులెత్తరుగా
నారీమణులకు వారము యౌవన
వారక యొసగెడు వారిజాక్షునికి ||గంధము||

పూజలు సేయరుగా మనసార పూజలు సేయరుగా
జాజులు మరి విరజాజులు దవనము
రాజిత త్యాగరాజ నుతునికి ||గంధము||


గిరిరాజసుతాతనయ….

ఫిబ్రవరి 2, 2008

గాత్రం :  నెయ్యెలి సంతాన గోపాలన్

రాగం : బంగాళ
తాళం : దేశాది

పల్లవి :
గిరిరాజసుతాతనయ సదయ ||గిరి||

అనుపల్లవి :
సురనాధముఖార్చిత పాదయుగ
పరిపాలయమాం ఇభరాజముఖ ||గిరి||

చరణం :
గణనాధ పరాత్పర శంకరా
గమవారినిధి రజనీకరా
ఫణిరాజకంకణ విఘ్ననివారణ
శాంభవ శ్రీ త్యాగరాజనుత ||గిరి||

గాత్రం : శంకర్ మహదేవన్