గంధము పుయ్యరుగా…

రాగం: పున్నాగవరాళి
తాళం: ఆది

పల్లవి:

గంధము పుయ్యరుగా పన్నీరు
గంధము పుయ్యరుగా

అను పల్లవి:

అందమయిన యదునందనుపై
కుందరదన లిరవొందగ పరిమళ ||గంధము||

తిలకము దిద్దరుగా కస్తూరి తిలకము దిద్దరుగా
కలకలమను ముఖకళగని సొక్కుచు
బలుకుల నమృతము లొలికెడు స్వామికి ||గంధము||

చేలము గట్టరుగా బంగారు చేలము గట్టరుగా
మాలిమితో గోపాలబాలులతో
నాల మేపిన విశాలనయనునికి ||గంధము||

హారతులెత్తరుగా ముత్యాల హారతులెత్తరుగా
నారీమణులకు వారము యౌవన
వారక యొసగెడు వారిజాక్షునికి ||గంధము||

పూజలు సేయరుగా మనసార పూజలు సేయరుగా
జాజులు మరి విరజాజులు దవనము
రాజిత త్యాగరాజ నుతునికి ||గంధము||

3 స్పందనలు to “గంధము పుయ్యరుగా…”

  1. బాలమురళీకృష్ణ గారి తిల్లానా « వికటకవి అన్నారు:

    [...] నా భజనకీర్తనలు బ్లాగులో గంధము పుయ్యరుగా కీర్తన కోసం వెతుకుతుంటే, ఈ తిల్లానా [...]

  2. రాఘవ అన్నారు:

    ఆరంభంలో ఏమిట్రా బాబూ ఇలా పాడాడీయన అనిపించినా… తర్వాత రామవర్మగారు బాగానే పాడాడు అనిపించింది.

  3. వికటకవి అన్నారు:

    కేరళీయుడు అవటం వల్ల పలకటం కొంత వేరుగా ఉంటుంది. ఏసుదాసు శాస్త్రీయం ఎంత బాగా పాడినా ఆ లోటు కనపడుతూనే ఉంటుంది.

ప్రత్యుత్తరమిమ్ము