గాత్రం : నెయ్యెలి సంతాన గోపాలన్
రాగం : బంగాళ
తాళం : దేశాది
పల్లవి :
గిరిరాజసుతాతనయ సదయ ||గిరి||
అనుపల్లవి :
సురనాధముఖార్చిత పాదయుగ
పరిపాలయమాం ఇభరాజముఖ ||గిరి||
చరణం :
గణనాధ పరాత్పర శంకరా
గమవారినిధి రజనీకరా
ఫణిరాజకంకణ విఘ్ననివారణ
శాంభవ శ్రీ త్యాగరాజనుత ||గిరి||
గాత్రం : శంకర్ మహదేవన్
6:24 అపరాహ్నం వద్ద జూన్ 17, 2008 |
నాకైతే నెయ్వేలీ గోపాలుడికంటే ఈ శంకరుడే బాగా పాడాడేమో అనిపించింది…
6:52 అపరాహ్నం వద్ద జూన్ 17, 2008 |
రాఘవ, నాకూ మహదేవనే నచ్చాడు. టెంపో ఒక కారణమేమో .
7:02 అపరాహ్నం వద్ద జూన్ 17, 2008 |
సంతానగోపాలన్ ఉచ్చారణా, ఎంచుకున్న సంగతులూ, వెనకాల ఫిడేలు పై పలికించిన “సా పా సా ప స ని ద ప మ గ …” చిట్ట స్వరమూ, చివర్లో అంత అందం లేని కల్పనా స్వరాలూ — అన్నీ కారణమే.
11:22 పూర్వాహ్నం వద్ద డిసెంబరు 31, 2008 |
2:12 mins and 2:52 in youtube.com, శంకర్ గారి వీడియొ లో, ఆ స్వర స్థాయి , నాకెందుకో ఇబ్బంది గా తోచింది.
మీరు గమనిస్తే, వాయిద్యాల కంటే, శంకర్ గారి గొంతు తక్కువ వినపడుతుంది, కొన్ని చోట్ల, ఎప్పుడు కూడా, కచ్చేరి లో, గాయకుడి స్వరం ఎక్కువ వాల్యుం లో వినపడాలి. ఏ మాట కి ఆ మాటే, శంకర్ గారి పాట లొ టెంపొ బాగుంది. ఆ టెంపొ తో, గోపాలన్ గారు పాడి ఉంటే, భలే ఉండేది.
టెంపొ మాత్రం, మన తరానికి నచ్చేట్టు, కొంచెం వేగంగా ఉంది కానీ, మీ కంటే చిన్న ఐనా సరే, నాకు మాత్రం, గోపాలన్ గారి పాట, బాగా నచ్చింది.
ఈ పాట ని పరిచయం చేసినందుకు, ధన్యవాదాలు.