దేవాధిదేవా శ్రీ వాసుదేవా

దేవాధిదేవా శ్రీ వాసుదేవా
కావుమయ్య నన్ను కరుణాలవాల ||దేవా||

ఈ వేళనా ఆరు శత్రులను
నీవే పారద్రోలి నిజభక్తుజేసి ||దేవా||

నే జేసిన పుణ్యఫలమొ
నా పూర్వజుల పుణ్యఫలమొ
శ్రీ జానకీశ ఈ జన్మమిచ్చి
నన్ను ధన్యునిగ భువి జేర్చితివి ||దేవా||

ఒక స్పందన to “దేవాధిదేవా శ్రీ వాసుదేవా”

  1. రాఘవ అన్నారు:

    ఈ కృతి పేరుకి మైసూరు వాసుదేవాచార్యులదే ఐనా దీనికి ఆదరణ తీసుకువచ్చింది బాలమురళీనే. ఆయన ఎంత ఆదరణ తీసుకువచ్చారంటే వాసుదేవాచార్యులే ఒక సందర్భంలో “ఆ కృతి బాలమురళీదే. దాన్ని నేను రాసానని కూడా నాకు గుర్తు లేదు. దానిని ఉద్ధరించింది బాలమురళీనే కాబట్టి అది ఆయన కృతే” అన్నార్ట.

ప్రత్యుత్తరమిమ్ము