మేలుకొను శ్రీరంగనాథా….

మేలుకొను శ్రీరంగనాథా
మేలుకొను వైకుంఠనాథా
మేలుకొను లక్ష్మీసనాథా
మేలుకొనవయ్యా రంగా మేలుకో ||మేలుకొను||

తెల్లవారెను తూర్పుదిక్కున
తెరలి తిమిరము గుహలు జొచ్చెను
తెల్లనాయెను తిరువళికలు తేజమణిగేను
పల్లవించెను భానుబింబము
ప్రబలుచు వేంచేసి వచ్చెను
యెల్ల జనులకు కోర్కె లొసగను
వల్లభుడ లేరా శ్రీరంగా మేలుకో ||మేలుకొను||

గంగ గౌతమి యమున నర్మద
తుంగభద్రయు కృష్ణవేణియు
రంగవాహినులౌ సరస్వతి రమ్యమౌ నదులూ
పొంగి తమ తమయందు గలిగిన
పుణ్యతీర్థము లన్ని తెచ్చిరి
మంగళప్రదమైన నీముఖ మార్జనమ్మునకు
శ్రీ రంగా మేలుకో ||మేలుకొను||

గరుడ గంధర్వ యక్ష కిన్నర
సిద్ధ విద్యాధరులు మునులు
దేవదానవ గణము లన్నియు
మచ్చికను మిమ్ము
అక్షయంబగు మోక్షమిమ్మని
వచ్చి మీ ద్వారంబునందున
హెచ్చుగా మొరలిడుచు నుండిరి
వేగ మేల్కొనుమా శ్రీరంగా మేలుకో ||మేలుకొను||
 

ప్రత్యుత్తరమిమ్ము