గంధము పుయ్యరుగా…

జూన్ 16, 2008

రాగం: పున్నాగవరాళి
తాళం: ఆది

పల్లవి:

గంధము పుయ్యరుగా పన్నీరు
గంధము పుయ్యరుగా

అను పల్లవి:

అందమయిన యదునందనుపై
కుందరదన లిరవొందగ పరిమళ ||గంధము||

తిలకము దిద్దరుగా కస్తూరి తిలకము దిద్దరుగా
కలకలమను ముఖకళగని సొక్కుచు
బలుకుల నమృతము లొలికెడు స్వామికి ||గంధము||

చేలము గట్టరుగా బంగారు చేలము గట్టరుగా
మాలిమితో గోపాలబాలులతో
నాల మేపిన విశాలనయనునికి ||గంధము||

హారతులెత్తరుగా ముత్యాల హారతులెత్తరుగా
నారీమణులకు వారము యౌవన
వారక యొసగెడు వారిజాక్షునికి ||గంధము||

పూజలు సేయరుగా మనసార పూజలు సేయరుగా
జాజులు మరి విరజాజులు దవనము
రాజిత త్యాగరాజ నుతునికి ||గంధము||


ఆలోకయే శ్రీ బాలకృష్ణం

మే 19, 2008

రాగం: హుసేని

తాళం: ఆది

 

ఆలోకయే శ్రీ బాల కృష్ణం

సఖి ఆనంద సుందర తాండవ కృష్ణం ||ఆలోకయే||

 

చరణ నిక్వణిత నూపుర కృష్ణం

కర సంగత కనక కంకణ కృష్ణం ||ఆలోకయే||

 

కింకిణీ జాల ఘణ ఘణిత కృష్ణం

లోక శంకిత తారావళి మౌక్తిక కృష్ణం ||ఆలోకయే||

 

సుందర నాసా మౌక్తిక శోభిత కృష్ణం

నంద నందనం అఖండ విభూతి కృష్ణం ||ఆలోకయే||

 

కంఠోప కంఠ శోభి కౌస్తుభ కృష్ణం

కలి కల్మష తిమిర భాస్కర కృష్ణం ||ఆలోకయే||

 

నవనీత ఖంఠ దధి చోర కృష్ణం

భక్త భవ పాశ బంధ మోచన కృష్ణం ||ఆలోకయే||

 

నీల మేఘ శ్యామ సుందర కృష్ణం

నిత్య నిర్మలానంద బోధ లక్షణ కృష్ణం ||ఆలోకయే||

 

వంశీ నాద వినోద సుందర కృష్ణం

పరమహంస కుల శంసిత చరిత కృష్ణం ||ఆలోకయే||

 

గోవత్స బృంద పాలక కృష్ణం

కృత గోపికా చాల ఖేలన కృష్ణం ||ఆలోకయే||

 

నంద సునందాది వందిత కృష్ణం

శ్రీ నారాయణ తీర్థ వరద కృష్ణం ||ఆలోకయే||


గిరిరాజసుతాతనయ….

ఫిబ్రవరి 2, 2008

గాత్రం :  నెయ్యెలి సంతాన గోపాలన్

రాగం : బంగాళ
తాళం : దేశాది

పల్లవి :
గిరిరాజసుతాతనయ సదయ ||గిరి||

అనుపల్లవి :
సురనాధముఖార్చిత పాదయుగ
పరిపాలయమాం ఇభరాజముఖ ||గిరి||

చరణం :
గణనాధ పరాత్పర శంకరా
గమవారినిధి రజనీకరా
ఫణిరాజకంకణ విఘ్ననివారణ
శాంభవ శ్రీ త్యాగరాజనుత ||గిరి||

గాత్రం : శంకర్ మహదేవన్


గాయతి వనమాలీ ….

ఫిబ్రవరి 1, 2008

రాగం : హంసధ్వని
తాళం : ఆది
గాత్రం : మంగళంపల్లి బాలమురళీకృష్ణ

గాయతి వనమాలీ మధురం ||గా||

పుష్ప సుగంధ సుమలయ సమీరే
మునిజన సేవిత యమునాతీరే ||గా||

కూజిత శుక పిక ముఖ ఖగ కుంజే
కుటిలాలక బహు నీరద పుంజే ||గా||

తులసీ ధామ విభూషణ హరీ
జలజ భవ స్తుత సద్గుణ శౌరీ ||గా||

పరమ హంస హృదయోత్సవకారీ హరీ
పరిపూరిత మురళీరవధారీ ||గా||
 


శ్రీమన్నారాయణ …..

జనవరి 7, 2008

రాగం :
తాళం :
గాత్రం : ఎం.ఎస్.సుబ్బులక్ష్మి

శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ
శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణు ||

కమలాసతీ ముఖకమల కమలహిత
కమలప్రియ కమలేక్షణా
కమలాసనహిత గరుడగమన శ్రీ
కమలనాభ నీ పదకమలమే శరణు || శ్రీ||

పరమ యోగిజన భాగధేయ శ్రీ
పరమ పూరుషా పరాత్పరా
పరమాత్మ పరమాణురూప శ్రీ
తిరువేంకటగిరిదేవ శరణు || శ్రీ||


దేవాధిదేవా శ్రీ వాసుదేవా

డిసెంబరు 18, 2007

దేవాధిదేవా శ్రీ వాసుదేవా
కావుమయ్య నన్ను కరుణాలవాల ||దేవా||

ఈ వేళనా ఆరు శత్రులను
నీవే పారద్రోలి నిజభక్తుజేసి ||దేవా||

నే జేసిన పుణ్యఫలమొ
నా పూర్వజుల పుణ్యఫలమొ
శ్రీ జానకీశ ఈ జన్మమిచ్చి
నన్ను ధన్యునిగ భువి జేర్చితివి ||దేవా||


మేలుకొను శ్రీరంగనాథా….

అక్టోబర్ 9, 2007

మేలుకొను శ్రీరంగనాథా
మేలుకొను వైకుంఠనాథా
మేలుకొను లక్ష్మీసనాథా
మేలుకొనవయ్యా రంగా మేలుకో ||మేలుకొను||

తెల్లవారెను తూర్పుదిక్కున
తెరలి తిమిరము గుహలు జొచ్చెను
తెల్లనాయెను తిరువళికలు తేజమణిగేను
పల్లవించెను భానుబింబము
ప్రబలుచు వేంచేసి వచ్చెను
యెల్ల జనులకు కోర్కె లొసగను
వల్లభుడ లేరా శ్రీరంగా మేలుకో ||మేలుకొను||

గంగ గౌతమి యమున నర్మద
తుంగభద్రయు కృష్ణవేణియు
రంగవాహినులౌ సరస్వతి రమ్యమౌ నదులూ
పొంగి తమ తమయందు గలిగిన
పుణ్యతీర్థము లన్ని తెచ్చిరి
మంగళప్రదమైన నీముఖ మార్జనమ్మునకు
శ్రీ రంగా మేలుకో ||మేలుకొను||

గరుడ గంధర్వ యక్ష కిన్నర
సిద్ధ విద్యాధరులు మునులు
దేవదానవ గణము లన్నియు
మచ్చికను మిమ్ము
అక్షయంబగు మోక్షమిమ్మని
వచ్చి మీ ద్వారంబునందున
హెచ్చుగా మొరలిడుచు నుండిరి
వేగ మేల్కొనుమా శ్రీరంగా మేలుకో ||మేలుకొను||
 


లలిత శయనా చలిత హరిణా..

అక్టోబర్ 9, 2007

లలిత శయనా చలిత హరిణా
నయనా లెమ్మా తెలవారుచున్న దమ్మా
అలరుకొమ్మా తళుకు పసిడి కొమ్మా లెమ్మా
తెలవారుచున్నదమ్మా ||లలిత||

పులుగులవె మేతలకు తరలేను
మెలమెల్ల గురు డస్తమించేను
అల శుక్రతార మింటను పొడిచేను
కలసి మాతో రమ్మా కపటమును విడువమ్మా ||లలిత||

ఒకదైత్యవైరి ఆ దశకంఠసంహారి
అకళంకచరితముల ఒకచోట చేరి
ఈ పుణ్యదివసాన సఖియలు పాడేరు
తీపారు వలె నీట తీర్థమాడగదమ్మా ||లలిత||


కేశవ గోవింద మాధవా యని….

సెప్టెంబరు 26, 2007

కీర్తనకి, సాహిత్యానికి మధ్య కొన్ని పాఠ భేధాలున్నాయి. కానీ సాహిత్యం సరయినదే అని నేను నమ్ముతున్నాను. 

 

కేశవ గోవింద మాధవా యని
కీర్తన చేసే దెన్నటికో
నాశము లేని మోక్షమును పొందుట
నారాయణ నాకెన్నటికో ||కేశవ||

భక్తి మృదంగము తాళాదులతో
భజనలు చేసే దెన్నటికో
శక్తి మీరగ నృత్యము సేయుట
సారసాక్ష నా కెన్నటికో ||కేశవ||

పూవులతో నీ పాదంబులకును
పూజలు చేసే దెన్నటికో
నైవేద్యం బిడి పరమ భక్తిని
చాటించుట నా ఎన్నటికో ||కేశవ||

పాహి పాహియని పరమపురుష
నీ పాదంబుల బడు టెన్నటికో
దేహి దేహియని నీ కృపకొరకై
దేవురు లాడే దెన్నటికో ||కేశవ||

రామదాసులను బ్రోచినట్లు
సంరక్షణ చేసే దెన్నటికో
భామామణి రుక్మిణితో గూడి
బాసలు చేసే దెన్నటికో ||కేశవ||


భజన చేసే విధము దెలియండి…

సెప్టెంబరు 24, 2007

భజన చేసే విధము దెలియండి, జనులార మీరు
నిజము కనుగొని మోదమందండి ||భజన||

భజన చేసే విధము దెలియక
నిజముగా హరిభక్తు లనుకొని
మదగజము దెగవ్రేయ లేకను
సుజనులని దిరుగంగ నేలను ||భజన||

జ్ఞానులనుకొని యెగసి పడకండీ
జనులార తత్వజ్ఞానమందే మనసు నిలపండీ
జ్ఞానులనుకొని యెగసిపడి
అజ్ఞానములు పైబెట్టుకొన్నను
మానసంబున బుట్టి చచ్చియు
పూని మరి జన్మింపవలయును ||భజన||

వారు వీరని యెంచబోకండి
జనులార మీరు నోరుచచ్చినవారు కాకండి
వారు వీరని యెంచుటెల్లను
సారము లేనట్టి హీనత
పౌరుషులకే గాక పుణ్యము
ఊరి కథలం దేమి యున్నది ||భజన||

ధరణి శ్రీ నరహరిని గొలువండి
జనులార మీరు
పరమపదవి బొంద గోరండి
ధరను శ్రీఘటికాద్రి నరహరి
పరమభక్తవరుల మనుకొని
విరివిగా నరసింహదాసుని
వరకవిత్వము సార మనుకొని ||భజన||